హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కడప జిల్లాలో 39 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా రైతులకు సరైన సహాయక చర్యలు అందడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర విమర్శించారు. పంట నష్టపరిహారం, రుణమాఫీ, పంటల బీమా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరువు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.