GNTR: తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమీప ప్రధాన రహదారిని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారి వెంట పచ్చదనాన్ని పెంపొందించి, మొక్కలను చక్కగా నిర్వహించాలని గ్రీనరీ సిబ్బందికి సూచించారు. రహదారిని పూర్తిస్థాయిలో శుభ్రపరచి, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని నిరంతరం మెరుగ్గా నిర్వహించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో పారిశుద్ధ్యం, పచ్చదనం పరిశీలన


