హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి మహిళ మృతి

VSP: మారివలస వైఎస్సార్ కాలనీ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం రాత్రి జాతీయ రహదారి-16 దాటుతున్న బావిరి అన్నపూర్ణ (58)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలైన ఆమెను గాయత్రి ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఘటనపై మృతురాలి కుమారుడు శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.