BPT: బాపట్ల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. సోమవారం పట్టణంలో కూటమి పార్టీల కోలాహలం నెలకొంది. చైర్మన్ అభ్యర్థి ఇస్క సునీల్ నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. భారీ జనసందోహం మధ్య ఆయన నామినేషన్ కేంద్రానికి బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసిన ఇస్క సునీల్


