హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన

MNCL: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మంగళవారం చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ, జైపూర్, చెన్నూర్ ప్రాంతాల్లో లబ్ధిదారులకు నూతన పెన్షన్‌లను మంత్రి అందజేస్తారు. అనంతరం చెన్నూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన బీసీ సంక్షేమ వసతి గృహ భవనాన్ని ప్రారంభించనున్నారు.