హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండికోట పర్యాటక కేంద్రంలో వసతులపై ఫిర్యాదులు

KDP: జమ్మలమడుగు మండలం గండికోట పర్యాటక కేంద్రంలో సౌకర్యాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెస్టారెంట్‌లో భోజనం రుచికరంగా ఉండటం లేదని పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకుంటున్న కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సందర్శకులు కోరుతున్నారు.