హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లల సమస్యలపై కలెక్టర్‌కు వినతులు

MLG: సమీకృత కలెక్టరేట్‌లో "నా రోజు నా హక్కులు.. నా భవిష్యత్" నినాదంతో పిల్లల ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.