హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సండ్లపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ

సత్యసాయి: హిందూపురం మండలం సండ్లపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాలను తొలగించి ఆలయంలోకి ప్రవేశించి హుండీని పగలగొట్టి నగదు అపహరించారు. హుండీలో సుమారు రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నట్లు గ్రామస్థులు అంచనా వేస్తున్నారు. అలాగే, ఆలయ వస్తువులను ధ్వంసం చేశారు.