హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పది మండలాలలో రెండో దశ ఎన్నికలు

CTR: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలో రెండవ దశ పంచాయతీ ఎన్నికలు 10 మండలాలలో జరగనున్నాయి. చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని బంగారుపాళ్యం, ఐరాల, పులిచెర్ల, పూతలపట్టు, రొంపిచెర్ల, తవణంపల్లె, యాదమరి మండలాలు ఉన్నాయి. నగరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని నగరి, నిండ్ర, విజయపురం మండలాలలో ఈనెల 29న ఎన్నికలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.