హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 17 నుంచి మహిళల క్రీడా పోటీలు ప్రారంభం

ATP: గుంతకల్లు పట్టణంలోని శంకరానంద స్వామి స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 17 నుంచి అంతర్ కళాశాలల మహిళా క్రీడ పోటీలు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్కేయూ అనుబంధ అంతర్ డిగ్రీ కళాశాల క్రీడాకారిణులు ఖోఖో, కబడ్డీ, తదితర పోటీల్లో తలబడతారని తెలిపారు.