మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని మామిడిగూడ రైతులు కౌలు భూమిలో కూరగాయల సాగు చేపట్టి నష్టపోయారు. ప్రభుత్వ సూచనల మేరకు ఆరుతడి పంటలు పండించినా పెట్టుబడులు కూడా రావడం లేదని ఇవాళ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో పాటు, ఎమ్మెల్యే వినోద్ స్పందించి తమకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: ఆరుతడి పంటలు వేసినా నష్టం తప్పడం లేదు!


