హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి'

MHBD: జిల్లాలో పనిచేసి పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టులు ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, సమాజానికి సేవలందించిన రిటైర్డ్ జర్నలిస్టులు వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు.