హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవుని కడపలో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం

KDP: తిరుమలకు తొలిగడపగా ప్రసిద్ధిగాంచిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. వందలాది మంది భక్తులు కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.