హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

MHBD: పట్టణంలోని ఎంపీపీ యూపీఎస్ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థినులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో సరిపడా టాయిలెట్లు లేకపోవడంతో పాటు తరగతి గదుల కొరత ఉందని విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.