VZM: జిల్లాలో బంగారు, వెండి ఆభరణాలకు మెరుగులు పెడతామంటూ గ్రామాల్లో సంచరిస్తూ, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటువంటి వ్యక్తుల మాయమాటలకు మోసపోయి విలువైన ఆభరణాలను కోల్పోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


