NRPT: మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో సోమవారం ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను మరికల్ ఎస్సై రామ్‌లాల్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. గ్రామస్తుల సహకారంతో గ్రామంలో 8 సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామ సర్పంచ్ మురారి, ఉప సర్పంచ్ అశోక్, వాడు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
తీలేరులో సీసీ కెమెరాలు ఏర్పాటు


