NLG: రైతు సమస్యలు, వ్యవసాయ రంగ సవాళ్లపై చర్చించేందుకు నల్గొండలో అఖిల భారత కిసాన్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు గుండగోని మైసయ్య కన్వెన్షన్ హాల్లో జరిగే సమావేశాలకు రాకేశ్ టికాయత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన రైతు ప్రతినిధులు సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నారు.
తెలంగాణ
నేటి నుంచి కిసాన్ సభ ప్రతినిధుల సమావేశాలు


