హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాత్రికేయుల సేవలు అమోఘం: ఎమ్మెల్యే

ATP: జాతీయ పత్రికా దినోత్సవం (నవంబర్ 16) సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పాత్రికేయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా, ప్రజల గొంతుకగా నిలిచే పత్రికా రంగానికి ఆమె వందనం తెలిపారు. నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తెస్తూ సమాజ చైతన్యానికి కృషి చేస్తున్న పాత్రికేయుల సేవలను కొనియాడారు.