హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా మారిన పోలీస్ చెక్ పోస్ట్

SRD: సంగారెడ్డి మండలం MNR చౌరస్తా వద్ద పోలీస్ చెక్ పోస్ట్ 2 సంవత్సరాలుగా నిరుపయోగంగా మారింది. భవనం నిరూపయోగంగా ఉండడంతో పిచ్చి మొక్కలు పెరిగి శిథిలావస్థకు చేరుతుంది. దీంతో పోలీసులు ఎండలోనే విధులు నిర్వహించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు స్పందించి భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.