SKLM: టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లన్న ఆలయ ప్రాంగణంలో సోమవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. కే.కొత్తూరు పీహెచ్సీ సిబ్బంది ఆధ్వర్యంలో వైద్యాధికారి ఎస్.గాయత్రి పర్యవేక్షణలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు అనారోగ్యం తలెత్తితే తక్షణ వైద్య సేవలు అందించేందుకు ముందస్తు చర్యగా ఈ శిబిరం నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎండల మల్లన్న ఆలయం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు


