హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీగా పెరిగిన బిర్యానీ ధరలు!

TG: వీకెండ్‌లో సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లే సామాన్య ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి. బిర్యానీ ధర ప్లేటుపై రూ.50 వరకు, ఇడ్లీ, దోసె వంటి టిఫిన్ల ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరగడంతో మొత్తం బిల్లు తడిసి మోపెడవుతోంది. రెస్టారెంట్, హోటళ్లలో మెనూకు రెక్కలొచ్చాయి. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో నిత్యం రద్దీగా ఉండే ఓ హోటల్‌లో చికెన్‌ బిర్యానీ రూ.230కి అమ్మేవారు. ప్రస్తుతం రూ.50 పెంచి రూ.280కి విక్రయిస్తున్నారు.