హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం'

MHBD: తొర్రూరు పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని, ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రశ్నించినందుకు సోమవారం పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు.