WG: కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో ఆకివీడులోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునుండే పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని ఒత్తులు వెలిగించి కోనేరులో కార్తీకదీపాలను వదిలారు. అనంతరం ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో ఆకివీడులోని శైవక్షేత్రాలన్నీ మార్మోగాయి.
ఆంధ్రప్రదేశ్
భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు


