హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో తొలి రోజు 588 నామినేషన్లు

తిరుపతి: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజు 16 మండలాల పరిధిలో సర్పంచ్ పదవులకు 269, వార్డు సభ్యుల స్థానాలకు 319 చొప్పున మొత్తం 588 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు ఏర్పేడు మండలంలో అత్యధికంగా 42, రేణిగుంటలో 35, రైల్వేకోడూరులో 27 నామినేషన్లు వచ్చాయి.