హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

TPT: నవంబర్ 15న తిరుమల శ్రీవారిని 82,173 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,058 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.4.95 కోట్లు వచ్చింది. 4.21 లక్షల లడ్డూల విక్రయం, 2.59 లక్షల మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. నవంబర్ 16న దర్శన పరిస్థితి ఇలా.. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనానికి సుమారు 15-18 గంటల సమయం పడుతోంది.