ఏలూరు జిల్లా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్ బందేల శాంతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం ద్వారా లక్ష్యాలను చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ విజన్-2047 అంశంపై చిత్రలేఖన పోటీలు, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన


