ప్రకాశం: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కనిగిరి పట్టణంలోని స్థానిక శివాలయంలో తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివలింగానికి పాలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కనిగిరిలో ఘనంగా తొలి సోమవారం పూజలు


