హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య

విశాఖ: కళింగనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సరైన ఉపాధి దొరక్కపోవడం, ఎంతకీ వివాహం కావడం లేదనే మనోవేదనతో వంశీ దుర్గ(30) అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వంశీ దుర్గ ఇక్కడ అద్దె గదిలో ఉంటూ శనివారం రాత్రి ఉరివేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంటి యజమాని గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.