హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కార్యకర్తల సన్నాహక సమావేశం

NDL: సిరివెళ్ల మండల కేంద్రంలో ఆదివారం టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసి మెలిసి పనిచేయాలన్నారు. పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.