హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అత్తా కోడళ్ల మధ్య గొడవ.. కోడలు మృతి

E.G: చిన్నారికి సిరప్ పట్టించే విషయంలో అత్తాకోడళ్ల మధ్య జరిగిన వాగ్వాదం విషాదానికి దారితీసింది. సీతానగరం మదర్ థెరిసా సెంటర్ సమీపంలో గుర్రం సత్య శ్యామలాంబిక (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అత్త మందలించడంతో మనస్తాపానికి గురై గదిలోకి వెళ్లిన ఆమె ఉరేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఆదివారం మృతురాలి అత్త, మరిదిపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.