హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నవరం ఆలయానికి రూ. 50 లక్షలు ఆదాయం

KKD: అన్నవరం రత్నగిరిపై సత్యదేవుని సన్నిధి వేలాదిగా వచ్చిన భక్తులతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ రద్దీగా మారింది. సుమారు 50 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 5,300 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా రూ. 50 లక్షల ఆదాయం సమకూరింది. వేల మంది భక్తులు సత్య దేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.