హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్భుతం... ఆకట్టుకున్న శివలింగం..!

NLR: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మనుబోలు మండలం యాచవరం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము తన అద్భుత కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు. సుమారుగా 150 రాగి గింజలతో శివలింగ రూపాన్ని అత్యంత సూక్ష్మంగా రూపొందించి ఆకట్టుకున్నారు. బొటనవేలు గోరుపై ఇమిడేలా తీర్చిదిద్దిన ఈ కళాఖండం చూపురులను అబ్బురు పరుస్తుంది. స్థానికుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.