చిత్తూరు: పులిచెర్ల మండలం 102 రామిరెడ్డిగారి పల్లె సమీపంలో ఆదివారం సాయంత్రం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు కదిరి రైల్వే ఎస్సై బాలకృష్ణ తెలిపారు. గుంతకల్లు నుంచి తిరుపతికి వెళుతున్న ప్యాసింజర్ ట్రైన్ కింద గుర్తు తెలియని వ్యక్తి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుని వయస్సు 40 ఏళ్లు ఉంటుందని, ఎలాంటి వివరాలు మృతుని వద్ద లభ్యం కాలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి


