హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుల్లేరులో ఇద్దరు బాలురు గల్లంతు

కృష్ణా జిల్లా పామర్రు గాంధీనగర్ వద్ద పుల్లేరు కాలువలోకి దిగిన ఇద్దరు బాలురు ఆదివారం గల్లంతయ్యారు. గాలింపులో 11 ఏళ్ల బాలుడి మృతదేహం లభించగా, 13 ఏళ్ల మరో బాలుడి ఆచూకీ ఇంకా తెలియలేదు. పామర్రు సీఐ నాగప్రసాద్, ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయం కోరారు. పోలీసులు, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో గాలింపు కొనసాగుతోంది.