హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మునుగోడులో ఘనంగా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

PLD: అమరావతి మండలం మునుగోడులో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ, శ్రీ వేంకటేశ్వర స్వామి పాదముల ప్రతిష్టా మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సతీమణి నంబూరు వసంత కుమారి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.