SKLM: రావివలస టెక్కలి మండల రావివలస ఎండల మల్లిఖార్జునస్వామి ఆలయంలో సోమవారం జరగనున్న కార్తీకమాస ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, బారికేడ్లను దేవదాయశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధికంగా రానున్న దృష్ట్యా టెంట్లు, తాగునీరు, ప్రసాదాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రావివలసలో కార్తీక ఉత్సవాలకు ఏర్పాట్లు


