కృష్ణా: పామర్రు మండలం కొత్తూరు వద్ద ఎన్హెచ్-165 పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న సుమారు 75 ఏళ్ల వృద్ధుడిని స్థానికులు గుర్తించారు. పామర్రు పోలీసులు అతడిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. వృద్ధుడి వివరాలు తెలియరాలేదు. ఆయన గురించి తెలిసినవారు పామర్రు పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
పామర్రు వద్ద అజ్ఞాత వృద్ధుడి మృతి


