కోనసీమ: మలికిపురం మండలం గుడిమెల్లంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అంబేడ్కర్ కోనసీమ జిల్లా అడిషనల్ ఎస్పీ మహేంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్థానిక పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ


