E.G: కేంద్ర బృందం శనివారం తూర్పుగోదావరి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించింది. కొవ్వూరు, నిడదవోలు, చాగల్లు మండలం మార్కొండపాడు, గోపాలపురం మండలం బొల్లాలి చెరువు వద్ద రైతులతో మాట్లాడింది. జిల్లాలో 20 మండలాల్లోని 244 గ్రామాలు, రెండు పట్టణాల్లో 10,823 మంది ప్రభావితమయ్యారని కలెక్టర్ కీర్తి చేకూరి వివరించారు. శాశ్వత మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేయాలని బృందం సూచించింది.
ఆంధ్రప్రదేశ్
ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కేంద్రబృందం


