హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

NLR: చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆదివారం నెల్లూరు జిల్లా అల్లూరు రోడ్డు వద్ద ప్రమాదం తప్పింది. ఎస్-5 బోగీకి చెందిన పవర్ కప్లర్ ఊడిపోయి ఎస్-6 బోగీ చక్రాల్లో చిక్కుకుంది. లోకోపైలట్ సమాచారంతో బిట్రగుంట రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి కప్లర్‌ను తొలగించడంతో ప్రమాదం తప్పింది.