SKLM: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా శ్రీకాకుళం పట్టణానికి చెందిన యాపార శ్రీనివాసరావు గారు నియమితులయ్యారు. ఈ మేరకు కౌన్సిల్ నుంచి నియామక పత్రం ఆదివారం అందినట్లు ఆయన తెలిపారు. సంస్థ నిబంధనల మేరకు ప్రజలకు అత్యవసర సమయాల్లో సేవలు అందించే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు. కౌన్సిల్ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
IHRC రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా శ్రీనివాసరావు


