హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజువాకలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

VSP: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ వాసు నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సీపీ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేరాలకు దూరంగా ఉండి, బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు. బెదిరింపులు, దాడులు, భూకబ్జాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.