CTR: పుస్తక పఠనంతో పరిజ్ఞానంతో పాటు విలువలు పెంపొందించుకోవచ్చని విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటపతి అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పుంగనూరులోని గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదవడం అలవర్చుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పుస్తక పఠనంతో విలువలు పెంపొందుతాయి'


