హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కలెక్టరేట్లో PGRS రద్దు

విశాఖపట్నం కలెక్టరేట్లో సోమవారం (16న) నిర్వహించాల్సిన PGRS కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ప్రకటించారు. అర్జీదారులు సోమవారం కలెక్టరేట్కు రావద్దని సూచించారు. తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని, అర్జీదారులు గమనించాలని కలెక్టర్ కోరారు.