సత్యసాయి: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని మంత్రి సవిత తన కుమారుడితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయంలో భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపీ ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సవిత


