హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో బిర్సా ముండా జయంతి వేడుకలు

ATP: ఆదివాసీ హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహానేత బిర్సా ముండా అని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మేడిద శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం అనంతపురం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో బిర్సా ముండా జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.