అన్నమయ్య: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని లైబ్రేరియన్ చంద్రశేఖర్ నాయక్ అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఆదివారం కురబలకోట లైబ్రరీలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులతో కలసి సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. పాఠ్య పుస్తకాలతో పాటు విజ్ఞానాన్ని పెంచే పుస్తకాలు, వార్తా పత్రికలు కూడా గ్రంథాలయాల్లో ఉంటాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయాలు విజ్ఞానభాండాగారాలు


