హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాచలంలో సహస్రనామార్చన నేత్రపర్వం

VSP: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం నాడు సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా సహస్రనామార్చన జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.