హైదరాబాద్: 28°C
తెలంగాణ

బిర్సా ముండా ఆశయాలు ఆదర్శం: ఎమ్మెల్యే

ADB: ఆదిలాబాద్‌లో బిర్సా ముండా జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న MLA పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం బిర్సా ముండా చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు.