హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెజ్జాలలో ఘనంగా పోచమ్మ అమ్మవారి కొలుపు

MNCL: జైపూర్ మండలం బెజ్జాల గ్రామంలో పోచమ్మ అమ్మవారి కొలుపు ఆదివారం 2వ రోజు కొనసాగుతుంది. గ్రామ సర్పంచ్ వేముల స్రవంతి రాజనర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బైండ్ల జమిడికళ, డప్పుచప్పుళ్ల నడుమ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో చల్లగా కాపాడాలని అమ్మవారిని కోరారు.